ఎన్ని వాడినా జుట్టు పొడవు పెరగడం లేదా?

జుట్టు రాలిపోకుండా ఉండటానికి, పొడవుగా పెరగడానికి రకరకాల చిట్కాలను పాటించడం మనలో చాలామందికి ఉన్న అలవాటే. కానీ ఎన్ని వాడినా మనం కోరుకున్న ఫలితం మాత్రం కనిపించదు. కొంతమంది మాత్రం ఏమీ వాడకపోయినా.. చాలా పొడవుగా, ఒత్తుగా ఉంటుంది. ఎందుకిలా జరుగుతుంది. మన జుట్టు పెరగుదలను ఆపేస్తున్న కారణాలేంటి? జుట్టు పెరగాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.

కురుల పెరుగుదలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని విషయాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ప్రధానమైనవి

  • వయసు
  • ఆరోగ్యం
  • జుట్టు తత్వం

సాధారణంగా జుట్టు ఎదగడానికి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వాటి వల్ల రాత్రికి రాత్రే కురులు ఒత్తుగా, పొడవుగా అయిపోతాయనుకుంటే పొరపాటే. ముందు మన హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుంటే.. దానికి అనుగుణంగా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన వస్తుంది.

సాధారణంగా జుట్టు పెరుగుదల మూడు దశల్లో ఉంటుంది.

అనాజెన్ : ఈ దశ దాదాపు 2-8 ఏళ్లు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక పెరుగుతుంది.

కాటజెన్ : ఈ దశ 4-6 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక పెరుగుదల ఆగిపోతుంది.

టెలోజెన్ : దీన్ని వెంట్రుక రాలిపోయే దశగా పరిగణిస్తారు. 2-3 నెలలు ఉంటుంది.

మన తలపై ఉన్నవాటిలో దాదాపు 90 – 95 శాతం మొదటి దశలో 5 నుంచి 10 శాతం మూడో దశలోనూ ఉంటాయి. అందుకే రోజుకి దాదాపుగా 100 నుంచి 150 వెంట్రుకలు రాలిపోతుంటాయి.

మరి వెంట్రుకలు పెరిగేలా చేయడం ఎలా?

ముందు చెప్పుకున్నట్టుగానే ఒకటి రెండు రోజుల్లో జుట్టు పొడవుగా పెరిగే అవకాశం లేదు. దానికోసం మనం కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి కురుల సంరక్షణ విషయం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పోషకాహారం

తినే ఆహారంలో జుట్టుకి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఆహారంలో ఒమెగా 3, ఒమెగా 6, జింక్, బీ 5, బయోటిన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ డి  కలిగిన ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటే.. మాత్రం డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి.

నూనెలు

ఎస్సెన్సియల్ నూనెలు ఉపయోగించడం ద్వారా జుట్టు ఎదిగేలా చేసుకోవచ్చు. రోజ్ మేరీ, జొజోబా, టీట్రీ, పెప్పర్మింట్ తదితర నూనెలను ఎస్సెన్సియల్ నూనెలు అని పిలుస్తారు. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే వీటిని నేరుగా వెంట్రుకలకు రాసుకోకూడదు. కొన్ని చుక్కలు కొబ్బరినూనెలో కలిపి రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే తలస్నానం చేసేటప్పుడు షాంపూలో కొన్ని చుక్కల జొజోబా నూనె కలిపి అప్లై చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

ప్రొటీన్

కురులపై కాలుష్య ప్రభావం పడకుండా ప్రొటీన్ కాపాడుతుంది. కాబట్టి ప్రొటీన్ నిండిన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే హీట్ స్టైలింగ్ చేసుకునేటప్పుడు అంటే.. స్ట్రెయిటనింగ్, కర్లింగ్ లాంటివి చేసుకునేటప్పుడు ప్రొటీన్ నిండిన హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. తలస్నానానికి ముందు తర్వాత కొంత కొబ్బరినూనె అప్లై చేసుకోవడం ద్వారా వెంట్రుకలు ప్రొటీన్ కోల్పోకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఎక్కువగా తింటే.. వెంట్రుకలు బిరుసుగా మారి తెగిపోయే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రొటీన్ విషయంలో సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా కూరగాయలు, నట్స్, పెరుగు వంటివాటిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ప్రొటీన్ పొందవచ్చు.

జుట్టు ఎదగడాన్ని ప్రభావితం చేసే అంశాలు

  • జన్యుపరమైన కారణాలు
  • కుటుంబంలో ఎవరికైనా జుట్టు రాలే సమస్య ఉండటం
  • హార్మోన్ల ప్రభావం
  • పోషకాహారం తీసుకోకపోవడం
  • అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఔషధాలు
  • ఒత్తిడి

జుట్టు విపరీతంగా రాలుతూ.. దానికి గల కారణాన్ని మీరు గుర్తించలేకపోతున్నట్లయితే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే.. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిపోవడం మన అనారోగ్యానికి సూచన కావచ్చు.

గర్భిణిల్లో ఎందుకు జుట్ట బాగా పెరుగుతుంది?

గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో జుట్టు వేగంగా పెరుగుతుంది. అలాగే.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంతే వేగంగా రాలిపోతుంది. దీనికి కారణం ఏంటంటే.. గర్భధారణ సమయంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకల అనాజెన్ దశ కాలాన్ని పెంచుతుంది. ప్రసవం జరిగిన తర్వాత ఈస్ట్రోజెన్ సాధారణ స్థాయికి రావడం వల్ల అవన్నీ మూడో దశకు చేరుకుని రాలిపోతాయి.

మన జీవన విధానం, వాతావరణంలో వచ్చిన మార్పులు మన జుట్టు పెరుగుదలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి మనం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం సంతులిత ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. జుట్టు రాలడం ఆగకపోతే.. వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.